ప్రకాశం జిల్లా వేటపాలెంలో "ది వేటపాలేం కో-అపరేటివ్ క్రెడిట్ సోసైటి లిమిటిడ్" బాధితులు వినూత్న నిరసన చేపట్టారు. బోర్డు తిప్పేసిన ఆ సంస్థ.. తమను మోసగించిందని ఆగ్రహిస్తూ.. సంస్థ మేనేజర్, సెక్రటరీ శ్రీనివాసరావు దొంగ అని గోడ పత్రాలు ముద్రించి అంటించారు. తమకు న్యాయం జరిగేంతవరకు ప్రతిరోజు ఏదో ఓ రకంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని అన్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చుడాలని డిపాజిట్ దారులు కోరుతున్నారు. వారంక్రితం కో-అపరేటివ్ క్రెడిట్ సోస్తెటిలో డిపాజిట్ దారులు దాచుకున్న 23 కోట్ల రుపాయిల నగదును గోల్ మాల్ చేసినట్లు డిపాజిట్ దారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు శ్రీనివాసరావుతో పాటు మరో ఏడుగురు బోర్డు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపించారు.