లాక్డౌన్తో పేద ప్రజలు అవస్థలు పడుతున్నారన్న ఉద్దేశంతో ప్రకాశం జిల్లా ఒంగోలులో వైకాపా నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. గాంధీనగర్లో 33 వార్డు వైకాపా నేత భాస్కర్ రెడ్డి ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో ప్రజలు సామాజిక దూరం పాటించినప్పటికీ.. కూరగాయలు అయిపోతాయేమోనన్న ఆందోళనతో ప్రజలు గుంపులుగా గుమిగూడారు. ఫలితంగా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం మరింత ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఒంగోలులో అన్నార్తులకు కూరగాయలు పంపిణీ - ongole news updates
లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన పేదలు, కార్మికులు, రోజువారీ కూలీలు ఉపాధి లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులను గమనించి.. కొందరు దాతలు ముందుకు వస్తున్నారు. తమ వంతు సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
ఒంగోలులో అన్నార్తులకు కూరగాయలు పంపిణీ