ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం కాలవలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఈపురుపాలెం పోలీసులు వెలికితీశారు. మండలంలోని విజయలక్ష్మీపురం కాలవ తలుపుల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే విషయాన్ని ఈపురుపాలెం పోలీసులకు తెలియజేశారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని వయసు సుమారు 45 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈపురుపాలెం కాలవలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం లభ్యం - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
కాలువలో కొట్టుకొచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం కాలువలో విజయలక్ష్మీపురం గ్రామస్థులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుని వయసు సుమారు 45 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఈపురుపాలెం కాలవలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం లభ్యం