ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RAPE: బహిర్భూమికి వెళ్లిన మైనర్​ బాలికపై అత్యాచారం.. నిందితులపై కేసు నమోదు - అత్యాచారం వార్తలు

ప్రకాశం జిల్లాలో మైనర్​ బాలికపై ఇద్దరు నిందితులు అత్యాచారం జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఇది చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

youngsters raped a girl
బహిర్భూమికి వెళ్లిన యువతి పై అత్యాచారం

By

Published : Jul 14, 2021, 11:03 PM IST

ప్రకాశంజిల్లా కురిచేడు ఆవులమంద గ్రామంలో ఓ మైనర్ బాలిక బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఇద్దరు యువకులు అత్యాచారం జరిపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తెల్లవారుజామున బాలిక బహిర్భూమికి వెళ్లగా ఇద్దరు యువకులు ఆమెను ద్విచక్రవాహనంపై వెంటాడారు. ఆమెను అడ్డుకుని అరవకుండా నోటిని గట్టిగా మూసివేసి తమతో పాటు గ్రామ శివారు ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లారు. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లిన వంశీ, కృష్ణలు అఘాయిత్యానికి తెగబడ్డారు.

ఇద్దరు నిందితుల్లో ఒకరు అత్యాచారం చేయగా మరొకరు అందుకు సహకరించినట్లు బాధితురాలి తల్లి తెలిపింది. ఆ తరువాత యువతిని గట్టిగా కొట్టి గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యారు. ఒంటరిగా అక్కడే వదిలేయడంతో భయపడిన బాధితురాలు తనను కనీసం ఇంటి వద్ద వదిలేయండంటూ ప్రాధేయపడింది. కానీ.. కనికరించని నిందితులు సదరు బాలికను చంపేస్తామని బెదిరించి ఘటనాస్థలి నుంచి వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details