ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు కార్లు ఢీ, ఇద్దరికి గాయాలు - ప్రకాశం జిల్లా ఒంగోలు చీరాల జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీ

ఎదురెదురుగా వెళ్తున్న రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లా ఒంగోలు - చీరాల జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

two persons injured in a road accident at ongole chirala highway
రెండు కార్లు ఢీ- ఇద్దరికి గాయాలు

By

Published : Mar 22, 2021, 12:28 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు - చీరాల జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాచపూడి గ్రామానికి చెందిన పాలేరు సుబ్బయ్య.. పెద్ద కుమార్తె లక్ష్మికి ఆదివారం వేకువజామున పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో సుబ్బయ్య.. చిన్న కూతురు సునీతతో కలిసి బంధువుల కారులో లక్ష్మిని ఒంగోలులోని వైద్యశాలలో తీసుకెళ్లారు. లక్ష్మి ప్రసవానంతరం మధ్యాహ్నం అదే కారులో సుబ్బయ్య, సునీతలు రాచపూడి బయలుదేరారు. ఈ క్రమంలో ఒంగోలు - చీరాల జాతీయ రహదారిపై నాగులుప్పలపాడు సమీపంలో వీళ్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టంది. ఈ ఘటనలో తండ్రి కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే రెండు కార్ల డ్రైవర్లు పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఒంగోలు వైద్యశాలకు తరలించారు. గాయపడిన సుబ్బయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరోవాహనం మేదరమెట్లకు చెందిన వాస్తు సిద్ధాంతి కారుగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి:యానాంలో అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

ABOUT THE AUTHOR

...view details