ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలకలం సృష్టిస్తున్న హత్యలు... కారణాలు ఇవే..! - borther murderd a boy in prakasam dst

ప్రకాశం జిల్లాలో ఈరోజు వేర్వేరు చోట్ల జరిగిన హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. చెల్లిని వేధిస్తున్నాడని ఓ అన్న... యువకుడిని కారుతో గుద్ది చంపేశాడు. మరోచోట బయటకు రమ్మని చెప్పి కత్తితో పొడిచి నిందితులు పరారయ్యారు.

two murdered in prakasam dst at chirala and second one in khambam
two murdered in prakasam dst at chirala and second one in khambam

By

Published : May 8, 2020, 9:30 PM IST

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో జక్కి కాశీశ్వరరావు( 28) అనే యువకుడిని పట్టపగలు హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. కంభం మండలం పొరుమామిల్లపల్లి గ్రామానికి చెందిన కాశీశ్వరరావు బైకుపై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన జక్కి కరుణాకర్ తన కారుతో ఢీ కొట్టి హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. కాశీశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. తన చెల్లెలిని వేధిస్తున్న కాశీశ్వరరావును కరుణాకర్ పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపాడు.

పక్కా ప్లాన్ తో హత్య... కత్తితో పొడిచి పరార్

చీరాల మండలం తోటవారిపాలెం కృపానగర్ సమీపంలో పట్టపగలు దారుణం జరిగింది. ఎన్. దినేష్ (20)అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. మృతుడు చీరాల హరీష్​పేటకు చెందిన యువకుడిగా గుర్తించారు. తోటవారిపాలెంకు చెందిన ఒక మిత్రుడి ద్వారా ఫోన్ రావడంతో దినేష్ అనే యువకుడు ద్విచక్రవాహనంపై వెదుళ్లపల్లికి బయలుదేరాడు. కృపానగర్ సమీపంలోకి రాగానే ముగ్గురు దుండగులు ఒక్కసారిగా కత్తితో గొంతుపై పొడిచి పరారయ్యారు.

ఇదీ చూడండిదారుణం : యువకుడిని కత్తితో పొడిచి చంపిన దుండగులు

ABOUT THE AUTHOR

...view details