ప్రకాశం జిల్లా కొత్తపట్టణం మండలం గుండమాలకు చెందిన ముగ్గురు మత్య్సకారులు రెండు రోజుల క్రితం సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారు ప్రయాణిస్తోన్న పడవకు దగ్గరగా ఓ సీసా తేలియాడుతూ కనిపించింది. సీసాలో ఉన్న ద్రవపదార్థాన్ని మద్యంగా భావించి తాగారు. ద్రావణాన్ని తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు. ఒడ్డుకు చేరుకొనే లోపే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరొకరికి పరిస్థితి విషమంగా ఉండటంతో గమనించిన సహచరులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మద్యం అనుకొని రసాయనం తాగారు.. ప్రాణాలు పోగొట్టుకున్నారు - killed with chemical effect
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు రసాయన పదార్థాన్ని మద్యంగా భావించి తాగారు. అనంతరం అస్వస్థతకు గురైన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఘటన వివరాలివి..!
ప్రకాశం జిల్లాలో రసాయన ద్రవం తాగి ఇద్దరు మత్స్యకారులు మృతి