ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం రెడ్డెంవారిపల్లి గ్రామంలో విషాదం జరిగింది. విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు.
విద్యుదాఘాతానికి ఇద్దరు మృతి.. శోకసంద్రంలో కుటుంబసభ్యులు
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాతపడ్డారు. జామాయిల్ చెట్లకు విద్యుత్ తీగలు తగిలి అంతరాయం ఏర్పడింది. చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
విద్యుదాఘానికి గురై ఇద్దరు వ్యక్తుల మృతి .. శోకసంద్రంలో కుటుంబసభ్యులు
గాయంవారిపల్లి గ్రామానికి చెందిన అన్నపురెడ్డి కొండలరెడ్డి, ముక్కు శేషారెడ్డి రెడ్డెంవారిపల్లిలో ఉన్న తమ పొలాల్లో మోటర్ వేసేందుకు వెళ్లారు. జామాయిల్ చెట్లకు తీగలు తగిలి విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. చెట్టు కొమ్మలు తొలగించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందారు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.