ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం వెలుగువారిపాలెం పాఠశాలలో ఏఫుగా పెరిగిన చెట్లను విద్యుత్ తీగలకు అడ్డు వస్తున్నాయనే కారణంతో విద్యుత్ శాఖ సిబ్బంది నరికేశారు. 3 సంవత్సరాల క్రితం ఈ బడి ఆవరణలో పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా 250 మొక్కలు నాటారు. వాటిని విద్యార్థులు సంరక్షిస్తూ వచ్చారు. వాటిలో చాలా మొక్కలు చెట్లుగా ఎదిగాయి. అయితే విద్యుత్ శాఖ సిబ్బంది కనీసం సమచారం ఇవ్వకుండా 22 పచ్చని చెట్లను నరికేశారు. నేలవాలిన వృక్షాలను చూసి ఉపాధ్యాయులు, విద్యార్థులు కంటతడి పెట్టారు.
మూడేళ్ల కష్టాన్ని 3 నిమిషాల్లో నేలకూల్చారు.. - వెలుగువారిపాలెంలో పాఠశాల ఆవరణలో చెట్లు కూల్చివేత
ఆ ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. 3 సంవత్సరాలపాటు వాటిని సంరక్షిస్తూ పెంచారు. ఆ బడిలో పచ్చని చెట్లు కావలసినంత ఆక్సిజన్ ఇస్తూ.. పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. అయితే అలాంటి వృక్షాలను విద్యుత్ శాఖ సిబ్బంది నరికేశారు. 3 సంవత్సరాల కష్టాన్ని 3 నిమిషాల్లో నేలకూల్చారు. తాము ఎంతో కష్టపడి పెంచుకున్న చెట్లు కూలిపోవడం చూసి మాష్టార్లు, పిల్లలు కంటతడి పెట్టుకున్నారు.
చెట్లు నరికివేత
పాఠశాల ఏర్పాటు చేసిన ఎన్నో ఏళ్లకు విద్యుత్ లైను వేశారని.. అది ప్రమాదభరితంగా ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు. విద్యుత్ లైనును మార్చకుండా ఏపుగా పెరిగిన చెట్లను నరికేయడం ఏంటని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా పాఠశాలలో గుండా వెళ్లే కరెంట్ లైనును తొలగించాలని.. చెట్లు నరికేసిన సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి..: కరోనా ఎఫెక్ట్.. ఉపాధి లేక.. వండ్రంగుల ఆకలి కష్టాలు