తీర ప్రాంతంలో వ్యక్తి దగ్గర దోచుకున్నారు.. దొరికేశారు! - chirala
తీరప్రాంతాల్లో దాడులకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను ప్రకాశం జిల్లా చీరాల రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురం, పొట్టిసుబ్బయ్యపాలెం మధ్య సముద్ర తీరంలో దేవన దినేష్ అనే యువకుడు ద్విచక్రవాహనంపై పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ముగ్గురు దాడిచేసి దినేష్ వద్ద చరవాణి, బంగారపు ఉంగరం, చేతి గడియారం దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన వేటపాలెం పోలీసులు చీరాల ఆటోనగర్ వద్ద మేకల అనిల్, కోమరగిరి సంజీవరవుతో పాటు మరో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. మేకల అనీల్ గతంలోనూ ఇదే తరహ దాడులకు పాల్పడ్డాడని చీరాల డీఎస్పీ నాగరాజు తెలిపారు.