ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలో ద్విచక్రవాహనాలను అపహరిస్తున్న ఓ బాలుడు.. పోలీసులకు పట్టుబడ్డాడు. చాణక్య పబ్లిక్ స్కూల్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా... గమనించిన బాలుడు వెనుకకు పారిపోయాడు. అతడిని వెంబడించి ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని విచారించారు. సెంటర్ లాక్ చేయకుండా ఉన్న వాహనాలను పిన్నీసుతో ఓపెన్ చేసి అపహరిస్తున్నాడని గుర్తించారు. 9 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బాలుడు చెడు వ్యసనాలకు బానిసై ఇలాంటి పనులు చేస్తున్నాడని చెప్పారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ద్విచక్ర వాహనాల అపహరణ... పోలీసుల అదుపులో బాలుడు - ప్రకాశం
ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న బాలుడిని... ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ద్విచక్రవాహనాల అపహరిస్తున్న బాలుడిని అరెస్టు చేసిన పోలీసులు