ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ... కొనసాగుతున్న దర్యాప్తు - news updates in prakasam district

ప్రకాశం జిల్లా కురిచేడులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. మాయమైన సరుకు విలువ సుమారు రూ.ఐదు లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

theft in govt wines at kurichedu prakasam district
ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ

By

Published : Mar 22, 2021, 8:38 PM IST

ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ కురిచేడు రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగినట్లు గుర్తించిన సిబ్బంది... సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై అధికారులు స్థానిక పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో విచారణ చేపట్టారు.

దుకాణంలో పనిచేసే సేల్స్​మెన్, సూపర్ వైజర్​ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మద్యం దుకాణం వెనుక భాగంలో ఉన్న కిటికీని తొలగించి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. మాయమైన సరుకు విలువను రూ.5 లక్షలుగా అంచనా వేశారు.

ABOUT THE AUTHOR

...view details