ప్రకాశం జిల్లా కారంచేడు మండలం రంగప్పనాయుడువారిపాలెంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన రావెళ్ల నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంటి తలుపులు పగులగొట్టి దుండగులు లోనికి ప్రవేశించారు.
బీరువా పగులగొట్టి అందులో ఉన్న 20 సవర్ల బంగారం, రూ.12 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుడు నాగేశ్వరరావు కారంచేడు పోలుసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.