బోధనాసుపత్రిలో పనిచేసే వైద్యులకు పీఆర్సీ అమలు చేయాలని, పదోన్నతులు కల్పించాలంటూ ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ధర్నా చేపట్టారు. ఆసుపత్రి ముందు కొద్దిసేపు ప్లకార్డులు పట్టుకొని తమ సమస్యలపై నినాదాలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ విధులు నిర్వహించిన వైద్యులకు ఇన్సెంటివ్లు, అడ్వాన్సు జీతాలు ఇచ్చారని.. మన రాష్ట్రంలో కూడా ఇవ్వాలని కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ వేడుకోలు కార్యక్రమంలో పాల్గొని, అనంతరం రోగులకు ఇబ్బంది లేకుండా విధులు నిర్వహించారు.
ప్రభుత్వానికి వైద్యుల వేడుకోలు - ongole rims hospital
ప్రకాశం జిల్లా ఒంగోలులో వైద్యులు ధర్నా చేపట్టారు. వైద్యులకు పీఆర్సీ అమలు చేయాలని, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
వైద్యుల వేడుకోలు