ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షాలకు కుప్పకూలిన ఆలయ ప్రహరీ - అడుసుమల్లిలో నీటమునిగిన దేవాలయాలు

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అడుసుమల్లిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పల్లపు ప్రాంతాలు, రహదారులు, పంటలు నీటమునిగాయి. రాత్రి నుంచి కురుస్తున్న వానలకు రామాలయం గోడ కూలిపోయింది.

కూలిన ఆలయ ప్రహరీ
కూలిన ఆలయ ప్రహరీ

By

Published : Sep 26, 2020, 2:27 PM IST

రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అడుసుమల్లిలోని దేవాలయాల్లోకి నీరు చేరింది. వానల ధాటికి రామాలయ ప్రహరీ కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేని కారణంగా.. ప్రమాదం తప్పింది. శివాలయమూ జలమయమైంది. గ్రామస్థులు నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

దేవాలయాలతో పాటు పర్చూరులోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. స్థానిక వాగులు పొంగి పొర్లుతున్నాయి. పొలాలు, లోతట్టు ప్రాంతాలు, రహదారులపై నీరు చేరగా.. రైతులు, ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details