అమెరికాలోని కొలరెడోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా బలికురవ మండలం కొమ్మినేనివారిపాలేనికి చెందిన చింతల శివతేజ మృతి చెందారు. ఉన్నత చదువుల కోసం ఆరేళ్ల క్రితం అమెరికా వెళ్లిన శివతేజ (27)..... అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. కొలరెడోలో ఉద్యోగిగా స్థిరపడ్డారు. స్నేహితునితో కలిసి కారులో బయటికి వెళ్లి తిరిగి వస్తుండగా.... మరో కారు వారి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో శివతేజ మృతి చెందారు.
అమెరికా ప్రమాదంలో ఆంధ్రుడు మృతి.. ఆరిన శివ'తేజం' - dead
అమెరికాలోని కొలరెడోలో రోడ్డు ప్రమాదం.. ఆంధ్రుడిని బలితీసుకుంది. మృతుడిని ప్రకాశం జిల్లాకు చెందిన శివతేజగా గుర్తించారు.
sivateja