ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థులతో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు సమావేశమయ్యారు. మున్సిపల్ పరిధిలోని 33 వార్డులకు గాను గతంలో 16 మంది తెదేపా అభ్యర్ధులు నామినేషన్లు వేశారని తెలిపారు. మిగిలిన 17 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి.. తెదేపా మద్దతు తెలుపుతుందన్నారు. మెుత్తంగా 33 వార్డుల్లో తెదేపా పోటీ చేస్తుందని వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా జెండా ఎగరవేస్తాం: రాజశేఖర్ బాబు - latest news in prakasam district
వైకాపా చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా జెండా ఎగరవేస్తామని దీమా వ్యక్తం చేశారు.
చీరాలలో మున్సిపల్ అభ్యర్ధులతో తెదేపా రాష్ట్ర కార్యదర్శి సమావేశం