' జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చండి' - TDP MLAS LETTER TO MINISTER ANIL
ప్రకాశం జిల్లాలో తాగునీటి అవసరాలను తీర్చాలని కోరుతూ... తెదేపా ఎమ్మెల్యేలు మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు లేఖ రాశారు. జిల్లాలోని చెరువులను కృష్ణా జలాలతో నింపాలని కోరారు.
ప్రకాశం జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు చెరువులను కృష్ణా జలాలతో నింపాలని... తెదేపా ఎమ్మెల్యేలు మంత్రి అనిల్ కుమార్కు లేఖ రాశారు. జిల్లాలో సగానికిపైగా ప్రజలు త్రాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా వచ్చేనీటిపై ఆధారపడి ఉన్నారన్నారు. నీరులేక చెరువులు అడుగంటుతున్నాయని తెదేపా శాసనసభ్యులు సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, బాలవీరాంజనేయస్వామి లేఖ రాశారు. ప్రధానంగా పర్చూరు, అద్దంకి, దర్శి, కందుకూరు, కొండపి నియోజకవర్గాల్లోని సగభాగం, ఒంగొలు, సంతనూతలపాడు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో కూడా సాగర్ నీటిని తాగునీటిగా వినియోగిస్తున్నారు. ఈనేపథ్యంలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని... సాగర్ కుడికాలువ నుంచి జిల్లా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాలని కోరారు.