తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన జీ ప్లస్ త్రీ ఇళ్ల రద్దును నిరసిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. తమ ప్రభుత్వ హయాంలో పేద వారి సొంతింటి కల నెరవేర్చేందుకు ఆ పథకాన్ని ప్రవేశపెడితే, వైకాపా ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం దారుణమన్నారు. కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పునుకుందే తప్ప అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టడం లేదని నారాయణరెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా మేల్కొని అభివృద్ది వైపు దృష్టి సారించి పేదింటి గృహాలను కొనసాగించాలన్నారు.
'వైకాపా కక్ష సాధింపుల్లో భాగంగా ఇళ్లను రద్దు చేసింది' - tdp leaders protest for houses news update
తెదేపా హయాంలో నిర్మించిన జీ ప్లస్ త్రీ ఇళ్ల రద్దును నిరసిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
జీ ప్లస్ త్రీ ఇళ్ల రద్దును నిరసిస్తూ తెదేపా నేతల ఆందోళన