ప్రకాశం జిల్లా కనిగిరిలో తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు. కనిగిరి తాహసీల్దార్ కార్యాలయం దగ్గర చేతులకు బేడీలు వేసుకొని, ప్లకార్డులు పట్టుకొని నేతలు నినాదాలు చేశారు. తాహాసీల్దార్ జ్వాలనరసింహకు వినతి పత్రం అందజేశారు. అమరావతి కోసం భూములను ఇచ్చిన రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి అభివృద్ధికి భూములు ఇవ్వడం రైతులు చేసిన నేరమా...అని ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ముఖ్యమంత్రి జగన్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపైనే ఎస్సీ వేధింపుల చట్టం కింద కేసులు పెట్టడం హాస్యాస్పదం అని అన్నారు. రైతుల చేతులకు బేడీలు వేయటంతోనే...ఈ ప్రభుత్వానికి పతనం మొదలైందని తెదేపా నాయకులు వ్యాఖ్యానించారు.