ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Prathipati: "మహానాడు" ఏర్పాట్లను పరిశీలించిన.. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

Prathipati: ఒంగోలు సమీపంలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లను మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఇతర తెలుగుదేశం నాయకులు పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ దగ్గరుండి పనులు చూసుకుంటున్నారు.

By

Published : May 23, 2022, 8:10 PM IST

Prathipati: ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర తెలుగుదేశం నాయకులు పరిశీలించారు. మండువారిపాలెం వద్ద దాదాపు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చదునైన పొలాల్లో మహానాడు వేదిక ఏర్పాటు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ దగ్గరుండి పనులు చూసుకుంటున్నారు.

ఇప్పటికే మహానాడు పనులు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున పందిళ్లు, రహదారులకు జంగిల్‌ క్లియరెన్స్​ వంటి పనులు చేపడుతున్నారు. మొత్తంగా మహానాడు ఏర్పాట్లకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details