మద్దతు ధర లేదంటూ టమోటాలను నేలపై పోసి నిరసన తెలుపుతున్న కౌలు రైతుటమాట పంటకు మద్దతు ధర ప్రకటించాలంటూ ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్ఆర్ సర్కిల్లో ఓ కౌలు రైతు నిరసన తెలిపారు. పంటకు మద్దతు ధర లేదంటూ దిగువమెట్ట ప్రాంతానికి చెందిన పుల్లయ్య అనే రైతు టమోటాలను నేలపై పోసి ఆవేదన వ్యక్తం చేశాడు. రెండున్నర ఎకరాల కౌలు పొలంలో సాగు చేసిన పంటను మార్కెట్కు తీసుకెళ్లగా బాక్స్ 30రూపాయల ధర పలుకుతోందని.. ఆటోలో తీసుకెళ్లేందుకు బాక్సుకు 20రూపాయలు ఖర్చు అవుతోందని పుల్లయ్య తెలిపాడు. ఎకరాకు పెట్టుబడి 30 వేల వరకూ అయిందని ఇప్పటికైనా కనీస ధర ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
ఇవి కూడా చదవండి...