ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతాపరుద్రుని కాలంనాటి తమిళ శాసనం - Tamil inscription of Prataparudra in Motupalli

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లిలో కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి కాలంలో తమిళ శాసనం బయటపడింది. శాసనం దొరికిన ప్రాంతం తమిళుల నివాస ప్రాంతంగా ఉండేదని.. వారికోసం తమిళంలో వేయించినట్లు భావిస్తున్నామని ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.

Prataparudra
ప్రతాపరుద్రుని శాసనం

By

Published : Aug 2, 2021, 8:29 AM IST

కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి కాలంలో తమిళంలో వేయించిన శాసనాన్ని ఏపీలోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లిలో ప్రముఖ చరిత్రకారుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఆదివారం గుర్తించారు. అక్కడి కోదండ రామస్వామి దేవాలయంలో ఈ శాసనం వెలుగుచూసింది. తిరువిడైయాట్టం పేరుతో నిర్వహించిన ఉత్సవాల సందర్భంగా మోటుపల్లిలోని రాజనారాయణ పెరుమాళ్‌ ఆలయానికి స్థానికుడు ఒకరు భూమిని దానం చేసిన వివరాలు అందులో ఉన్నాయని శివనాగిరెడ్డి తెలిపారు. కాకతీయ రాజులు తమిళ శాసనాన్ని వేయించడం భాషా పరంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. శాసనం దొరికిన ప్రాంతం తమిళుల నివాస ప్రాంతంగా ఉండేదని.. వారికోసం తమిళంలో వేయించినట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ విషయమై కేంద్ర పురావస్తు శాఖ శాసనవిభాగం సంచాలకుడు డాక్టర్‌ కె.మునిరత్నంరెడ్డి మాట్లాడుతూ..ఈ శాసనాన్ని గతంలో గుర్తించామని, అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details