సైనిక సంక్షేమ శాఖ జూనియర్ అసిస్టెంట్... లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా... ఉద్యోగి జాకీర్ అహ్మద్‌ను అనిశా అధికారులు పట్టుకున్నారు. సైనిక శాఖ మాజీ ఉద్యోగి నీలం అంజనేయులు... పీఎం మెరిట్ పథకం ద్వారా... కూతురు చదువుకు రూ.36 వేల స్కాలర్షిప్ కోసం సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో నమోదుచేసుకున్నాడు. కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జాకీర్... రూ.10 వేలు లంచం అడిగారు. ఆంజనేయులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. జాకీర్ అహ్మద్‌పై దృష్టిపెట్టిన ఏసీబీ అధికారులు... ఆంజనేయులు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. సొమ్మును సీజ్‌చేసి నిందితుడిని నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్
ఓ జూనియర్ అసిస్టెంట్... రూ.8వేలకు కక్కుర్తిపడ్డాడు. అనిశాకు చిక్కాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది.
పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్