లాక్డౌన్తో దర్జీ రంగం కుదేలైంది. కరోనా కారణంగా పెళ్లిళ్లు, శుభ కార్యాలు వాయిదా పడుతున్నాయి. ఉగాది, శ్రీరామనవమి వంటి పండగలు నాలుగు గోడలకే పరిమితమయ్యాయి. అలాగే వస్త్ర దుకాణాలు మూతపడటంతో దర్జీలకు పని లేకుండా పోయింది.
రాష్ట్రంలో దర్జీ పని మీద ఆధార పడి జీవిస్తున్న వారు 11లక్షల మంది వరకూ ఉన్నారు. ప్రస్తుతం వారందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుకాణాలు మూతపటంతో సహాయకులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని దర్జీలు అంటున్నారు. దుకాణాల అద్దెలు, విద్యుత్తు బిల్లులు, కుట్టు పనికి అవసరమైన దారాలు, గుండీలు వంటి వాటికి పెట్టిన పెట్టుబడులతో ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతున్నామని వీరు ఆవేదన చెందుతున్నారు.