ప్రకాశం జిల్లా కురుచేడు మండలం గంగదొనకొండ గ్రామ సమీపంలోని పొలాల్లో కుళ్లిపోయిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారమివ్వగా ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం గుర్తించే వీలు లేకుండా ఉందని పోలీసులు తెలిపారు. అయితే మృతదేహం వద్ద పసుపు, కుంకుమతో పూజలు చేసినట్లు తెలుస్తోంది. మృతుడికి చేతబడి చేశారా... లేక క్షుద్రపూజకు ముందు బలి ఇచ్చారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
కలకలం సృష్టిస్తున్న మృతదేహాలు.. ఆందోళనలో ప్రజలు - ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా కురుచేడు మండలంలో మృతదేహాలు కలకలం సృష్టించాయి. రెండు మృతదేహాలు వేర్వేరుచోట్ల లభ్యమవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సీఐ శ్రీనివాసరావు
నమ:శివాయపుర అగ్రహారం సమీపంలో సాగర్ కాలువ 404 మైలురాయి వద్ద మరో మృతదేహం లభ్యమైంది. మృతదేహం కాలువ గట్టు మీద పడిఉండటంతో... పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా హత్యచేసి గట్టుమీద పడేశారా... లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ రెండు మృతదేహాలు పాడైపోవడంతో గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులంటున్నారు.