ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెదగంజాంలోని భావనారాయణస్వామి ఆలయంలో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. లేలేత సూర్య కిరణాలు కాంతిని విరజిమ్ముతూ స్వామి వారి మూలవిరాట్టును తాకాయి. భానుడి కిరణాలు తాకి ఆ ఛాయలో మెరిసిపోయిన భావనారాయణస్వామిని చూసిన భక్తులు పరవశించిపోతున్నారు. ఏటా మార్చి, అక్టోబర్ మొదటి వారాల్లో మాత్రమే సూర్యకిరణాలు నేరుగా స్వామి వారిని తాకుతాయి.ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయాధికారులు చర్యలు చేపట్టారు.
భావనారాయణస్వామిని తాకిన సూర్యకిరణాలు - దగంజాంలోని భావనారాయణస్వామి ఆలయం వార్తలు
ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి చెందిన భావనారాయణస్వామి ఆలయంలో(bhavanarayanaswamy temple) స్వామి వారిని నేరుగా సూర్యకిరణాలు తాకాయి. ఏటా మార్చి, అక్టోబర్ మొదటి వారాల్లో మాత్రమే సూర్యకిరణాలు నేరుగా స్వామి వారిని తాకుతాయి. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున్న భక్తులు తరలివచ్చారు.
భావనారాయణస్వామిని తాకిన సూర్యకిరణాలు