తనపై జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా... లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు విన్నవించారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ఆర్య వైశ్య మహాసభకు స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్‌ను కలిసి.. గతంలో తనపై జరిగిన దాడిని వివరించారు. పార్టీలో జరుగుతున్న లోటుపాట్లను సరిదిద్దాలని సలహా ఇచ్చిన తనపై... మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. ఈ మొత్తం ఉదంతంపై విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు.
దాడి ఘటనపై విచారణ జరిపించండి: లోక్‌సభ స్పీకర్‌కు సుబ్బారావు గుప్తా వినతి - లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన వైకాపా నేత సుబ్బారావు గుప్తా
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడి చేశారని వైకాపా నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు విన్నవించారు.
లోక్‌సభ స్పీకర్