ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థి సంఘాల ఆందోళన... నూతన జాబ్ క్యాలెండర్​కు డిమాండ్ - ongloe latest protest news

ప్రకాశం జిల్లా ఒంగోలులో అఖిలపక్ష యువజన విద్యార్థి సంఘాల నేతలు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ ప్రకటనలు లేని జాబ్ క్యాలెండర్​ను రద్దు చేసి, నూతన జాబ్ క్యాలెండర్​ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఒంగోలులో విద్యార్థి సంఘాల ఆందోళన
ఒంగోలులో విద్యార్థి సంఘాల ఆందోళన

By

Published : Jul 7, 2021, 9:54 PM IST

నూతన జాబ్ క్యాలెండర్​ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ... ఒంగోలులో అఖిలపక్ష యువజన విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నగరంలోని ఫ్లై ఓవర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్​కు విద్యార్థి సంఘాల నేతలను తరలించారు.

ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు... ఉద్యోగాల ప్రకటన లేకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఉద్యోగాలు కావాలని అడిగితే... పోలీసులతో అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details