రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలు ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలను రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిములపు సురేష్ ప్రారంభించారు. 13 జిల్లా నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. సంపూర్ణ వికాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని, ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి అవంతి తెలిపారు. క్రీడలను ప్రోత్సహించడానికి అవసరమైన అన్ని హంగులను ప్రభుత్వం సమకూరుస్తోందని చెప్పారు. నాణ్యమైన విద్య అందించేందుకు అనేక సంస్కరణలు చేపట్టడమే కాకుండా, నిధులు కూడా విడుదల చేస్తున్నారని అన్నారు.
ఒంగోలులో రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలు ప్రారంభం - cm cup state level kabaddi has started in ongole
ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. 13 జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు.
ఒంగోలులో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలు