కరోనా మహమ్మారి బారిన పడిన జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి త్వరగా కోలుకోవాలని చీరాల వాసులు ప్రార్థించారు.
పట్టణంలోని మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ అసోసియేషన్, చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వినాయక ఆలయంలో పూజలు చేశారు. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.