ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు - శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు తాజా వార్తలు
పుష్యమాసపూర్ణిమ సందర్భంగా ప్రకాశం జిల్లా సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. మంగళ వ్యాద్యములతో అర్చకులు, సిబ్బంది ఆలయ ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రకాశం జిల్లా అద్దంకిలోని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పుష్యమాస పూర్ణిమ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రాతఃకాలమునందు దేవాలయంలో గోపూజ, సుప్రభాతము, బిందెతీర్ధము, విశ్వరూపసేవ, అభిషేకము కార్యక్రమాలను చేపట్టారు. మంగళ వ్యాద్యములతో వేద పండితులు, సిబ్బంది ఆలయ ప్రదక్షిణను చేపట్టారు. అనంతరం విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య, పరివార దేవతలకు నారికేళ ఫలసమర్పణ చేశారు. లక్ష తమలపాకులతో పూజలు నిర్వహించి.. స్వామివారికి హారతిని అందించారు.