ప్రకాశం జిల్లా దూపాడులో దారుణం జరిగింది. పింఛను డబ్బుల కోసం ఓ కుమారుడు కన్న తండ్రినే చితకబాదాడు. గ్రామానికి చెందిన సుబ్బయ్య(75)కు వృద్ధాప్య పింఛను వస్తోంది. ఎప్పటిలానే డిసెంబర్ నెల పింఛను తీసుకున్నాడు. కొడుకు ఆ సొమ్ము తనకు ఇవ్వాలని అడిగాడు. ఇందుకు సుబ్బయ్య నిరాకరించాడు. ఆగ్రహానికి గురైన కొడుకు కర్రతో తండ్రిని కొట్టాడు. దీనిని గమనించిన స్థానికులు అతన్ని వారించి వృద్ధుడిని కాపాడారు.
పింఛను డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై కుమారుడి దాడి - son attack on father in prakasam dst
ముడతలుపడిన శరీరం... ఒంట్లో ఓపిక... ఇంట్లో సొమ్ము లేకుండా ఎలా కాలం వెల్లదీయాలిరా దేవుడా ! అనుకునే వృద్దులకోసం ప్రభుత్వం పింఛను రూపంలో ఎంతో కొంత సాయం చేస్తోంది. వాటి కోసం కడుపున పుట్టినవారే కిరాతకంగా వారిని వేధించుకు తింటున్నారు. డబ్బులు ఇస్తావా... చస్తావా అంటూ తండ్రిని చితకబాదాడు ఓ కుమారుడు. ప్రకాశం జిల్లా దూపాడులో జరిగిన ఘటన వివరాలివి..!
పింఛను డబ్బులకోసం తండ్రిని కొట్టిన కొడుకు