అమరావతిలో రైతుల ఉద్యమం 208వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా దర్శి శివరాజనగర్లోని యువకులు అమరావతి రైతులకు సంఘీభావంగా నినదించారు. మా యువత భవిత అమరావతి మీద ఆధారపడి ఉంది కాబట్టి అమరావతిలోనే రాజధాని నిర్మించాలని అన్నారు. దొడ్డిదారిన, విశాఖలో రాజధాని ఆలోచనను విరమించుకోవాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడా? అనే అయోమయంలో ప్రజలు ఉన్నారని, పెట్టుబడులు ఆకర్షించే ఆర్థిక రాజధాని లేకపోవడంతో... ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి మీద ప్రభావం చూపుతుందని అన్నారు.
' యువత భవిష్యత్తు అమరావతి మీదే ఆధారపడి ఉంది' - ఈటీవీ భారత్ తాజా వార్తలు
అమరావతి రైతుల ఉద్యమం 208వరోజుకు చేరుకున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా దర్శి శివాజనగర్లోని యువకులు రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయం మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. యువత భవిత అమరావతి మీద ఆధారపడి ఉందని, అమరావతిలోనే రాజధాని నిర్మించాలని కోరారు.
' యువత భవిష్యత్తు అమరావతి మీదే ఆధారపడి ఉంది'