ETV Bharat / state
'అధికారంలోకి వస్తే వెలుగొండ నీళ్లిస్తాం' - ప్రచారం
వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడే అనీ దానికి ఆయనే ప్రారంభిస్తారని ఒంగోలు ఎంపీ అభ్యర్థి శిద్ధా రాఘవరావు అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టారు.
శిద్దా రాఘవరావు ఎన్నికల ప్రచారం
By
Published : Apr 2, 2019, 10:43 AM IST
| Updated : Apr 2, 2019, 10:50 AM IST
శిద్దా రాఘవరావు ఎన్నికల ప్రచారం వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడేనని దానినిఆయనే ప్రారంభిస్తారని ఒంగోలు ఎంపీ అభ్యర్థి శిద్ధా రాఘవరావు అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టిన శిద్ధా...పెద్దరవిడు మండలం కుంటలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి బుదాల అజితారావుతో కలిసి రోడ్ షో నిర్వహించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను పక్క రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. మోదీ , జగన్, కేసీఆర్ కలిసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలనుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే తెదేపాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇవీ చదవండి..
Last Updated : Apr 2, 2019, 10:50 AM IST