ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెరుగుతున్న కరోనా కేసులు..వేటపాలెంలో కఠిన ఆంక్షలు - వేటపాలెంలో కరోనా కేసులు

ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. వేటపాలెంలో కఠిన ఆంక్షలు విధించారు.

Shops are allowed from 6 am to 9 am in the vetapalem prakasam district
వేటపాలెంలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకే దుకాణాలకు అనుమతి

By

Published : Jun 28, 2020, 4:50 PM IST

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా వేటపాలెంలో అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలోని రహదారులపై ముళ్ల కంచెలను అడ్డుగా వేశారు. సోమవారం నుంచి వేటపాలెం పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని... అనంతరం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్థానిక తహశీల్దార్ మహేశ్వరరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details