ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధాన్యం కొనుగోలుకు అవగాహన సదస్సు - ఒంగోలు వార్తలు

నాణ్యతా ప్రమాణాలను విస్మరించకుండా ధాన్య సేకరణ చేపట్టాలని జిల్లా పౌరసరఫరాల మేనేజర్​ రామనుజమ్మ అన్నారు. ప్రకాశం జిల్లాలో ధాన్యం కొనుగోలు అంశంపై ఆమె అవగాహన సదస్సు నిర్వహించారు.

seminor
అవగాహన సదస్సు

By

Published : Dec 18, 2020, 2:58 PM IST

ధాన్యం సేకరణలో నాణ్యతా ప్రమాణాలను విస్మరించకుండా పనిచేయాలని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ రామనుజమ్మ పేర్కొన్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ధాన్యం కొనుగోలు అంశంపై వ్యవసాయ శాఖ సిబ్బంది, డీఆర్​డీఏ సిబ్బంది, గ్రామ సమాఖ్య సభ్యులతో అవగాహన సదస్సు నిర్వహించారు. టీసీఎస్​ సాంకేతిక సహకారంతో కొనుగోలు కార్యక్రమం నిర్వహిస్తున్నామని... తేమ శాతం, వ్యర్థ పదార్థాలు, కల్తీ రకాల వంటివి శాస్త్రీయ పద్ధతిలో గుర్తించాలని, రైతుకు మేలు జరిగే విధంగా వ్యవహరించాలని మేనేజర్​ పేర్కొన్నారు.

జిల్లాలో ప్రాథమిక పరపతి సంఘాలు, పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య , వెలుగు సంస్థల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టీసీఎస్​ ప్రతినిధి బృందం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.

ఇదీ చదవండి : పుంజుకుంటున్న గ్రానైట్‌ క్వారీలు... వీరికి పని లేదు..!

ABOUT THE AUTHOR

...view details