ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమవుతున్న వేళ... నేతలు ప్రచార పర్వంలో జోరు పెంచారు. నియోజకవర్గాల్లో ప్రతి గడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తున్నారు. తెదేపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి... ఓటు వేయాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే కాక మంత్రులు కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఒంగోలు పార్లమెంట్ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేస్తున్న రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు ప్రచారం ప్రారంభించారు. కుటుంబ సమేతంగా ఒంగోలు వీధుల్లో ఇంటింటా ప్రచారం చేశారు. దర్శి నియోజకవర్గంలో 3వేల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని.. ఒంగోలు నుంచి గెలిపిస్తే దర్శిలో చేసినట్లుగా పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.
శిద్దా రాఘవరావు, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి
రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ రావాలని మంత్రి లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన లోకేష్... 5 గ్రామాల్లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌తో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
లోకేష్, మంగళగిరి అభ్యర్థి
పేదల సంక్షేమానికి తెలుగుదేశం పాటుపడుతోందని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరలోని 6, 52వ డివిజన్లలో తెదేపా అభ్యర్థి, మంత్రి నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లకు విన్నవించారు. 71 ఏళ్లలో ఎవరు తీసుకురావాలని నిధులు తీసుకువచ్చే అభివృద్ధి చేశానన్నారు. నారాయణ, నెల్లూరు తెదేపా అభ్యర్థి
తాను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన కొవ్వూరుకు దీటుగా తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ తెలిపారు. కృష్ణాజిల్లా తిరువూరులో తన సన్నిహితులను ఆత్మీయంగా కలిసిన మంత్రి జవహర్... ఈ ఎన్నికల్లో తన విజయానికి సహకరించాలని కోరారు. గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాలస్వామి దర్శించుకుని.. ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈనెల 21న భారీ ప్రదర్శన తరలివెళ్లి నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు.