ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రంథాలయంలో సదుపాయాల కొరత

ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగమంటే...అందని ద్రాక్షే...అయితే ఇప్పుడు కొలువుల జాతర మొదలైంది. 22 లక్షల మంది గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారు. పోటీ పరీక్షలకు మొటీరియల్స్ కొనలేని పేద నిరుద్యోగులు మాత్రం గ్రంథాలయాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో గ్రంథాలయాలు నిరుద్యోగులతో నిండిపోతున్నాయి.

sachivalayam-jobs-candidates-problems

By

Published : Aug 15, 2019, 2:59 PM IST

గ్రంథాలయంలో సదుపాయాల కొరత
సచివాలయ ఉద్యోగాలకు ప్రకటన విడుదలైనప్పటి నుంచి నిరుద్యోగులు గ్రంథాలయానికి క్యూ కడుతున్నారు .ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా కేంద్ర గ్రంథాలయం ఏళ్లనాటిది.ఇప్పటి వరకు విద్యార్థులు పాఠ్య పుస్తకాల విభాగంలో బిజీ బిజీగా గడిపేవారు.ఇప్పుడు గ్రంథాలయంలో పరిస్థితి అంతా మారింది.భోజనం బాక్స్‌లు తెచ్చుకుని గ్రంథాలయం మూసివేసే వరకు అక్కడే ఉండి చదువుకుంటున్నారు.

ఉద్యోగానికి ఎంపిక అవ్వాలన్న వారి ఆశయం బలంగా ఉన్నా...గ్రంథాలయంలో సదుపాయాలు మాత్రం వెక్కిరిస్తున్నాయి.పరీక్షలకు కావాల్సిన మెటీరియల్స్ లేకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందిపడుతున్నారు.లైబ్రరీలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందన్న కారణంతో పుస్తకాలు తెచ్చుకుని మరీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు.పుస్తకాల కొరత విషయం గ్రంథాలయ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా....పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు వాపోయారు.

గ్రంథాలయంలో కుర్చీలు,స్టడీ టేబుళ్ల కొరత ఎక్కువగా ఉంది.దీంతో పాఠకులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి.సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ తర్వాత నిరుద్యోగులు ఎక్కువుగా వస్తున్నారని...వారికి సంబందించిన మెటీరియల్స్ కొరత ఉన్నమాట వాస్తవమేనని గ్రంథాలయ సిబ్బంది చెబుతున్నారు.త్వరలోనే పుస్తకాలు అందుబాటులోకి తెస్తామంటున్నారు.

జిల్లా గ్రంథాలయంలో సరైన సదుపాయాలు,పుస్తకాలు లేకపోవడం పట్ల విద్యార్థులు, నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

రక్షాబంధన్​తో ప్రకృతి బంధం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details