ప్రకాశం జిల్లా పొదిలి మండలం తల్లమల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని పెల్లూరు గ్రామానికి చెందిన పటాన్ ఫిరోజ్‌ఖాన్ టీవీ మెకానిక్‌గా పని చేస్తుండేవాడు. పని నిమిత్తం గురువారం రాత్రి దర్శి వెళ్లాడు. తిరిగి ఉదయం సొంతూరుకు బైక్‌పై వెళుతుండగా తల్లమల వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - ప్రకాశం జిల్లా తల్లమల వద్ద రోడ్డు ప్రమాదం
ప్రకాశం జిల్లా పొదిలి మండలం తల్లమల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పటాన్ ఫిరోజ్‌ఖాన్ అనే వ్యక్తి మృతి చెందాడు. బైక్‌పై వెళుతున్న అతనిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా.. తీవ్రంగా గాయపడి ప్రాణం విడిచాడు.
రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి