ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బెస్తవారిపేట మండలం పందిళ్లపల్లి వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో తండ్రి, కుమారుడు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు కడప జిల్లా కాశినాయన మండలం ఆకులనారాయణపల్లి వాసులుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామన్నారు.
రోడ్డు ప్రమాదం.. తండ్రి, కుమారుడు మృతి - ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం తండ్రి కుమారుడు మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్న ఘటనలో తండ్రి,కుమారుడు మృతి చెందారు.
road accident