ప్రకాశం జిల్లా కనిగిరి టుబాకో బోర్డు ఎదురుగా ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కనిగిరి మండలం ఉస్తుంవారిపల్లి గ్రామానికి చెందిన బ్రహ్మయ్య.. నందనమారెళ్లలో కూలి పనులు ముగించుకొని స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా బల్లికురవకు చెందిన వెంకటేశ్వర్లు, మరో వ్యక్తి ప్రయాణిస్తున్న వాహనం ఢీకొన్నాయి.
ఈ ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. బల్లికురవ గ్రామానికి చెందిన మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పంచనామా కోసం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.