రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ఒక కారు రోడ్డు అంచులో బోల్తా పడటంతో ఏడుగురికి గాయాలైన సంఘటన చదలవాడ సమీపంలో బుధవారం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చీరాలకు చెందిన కారులో కొంతమంది ఒంగోలులో తమ సొంత పనులు ముగించుకొని చీరాల వెళుతున్నారు. అదే క్రమంలో ఒంగోలు నవభారత్ థియేటర్ సమీపంలో నివాసం ఉండే కుటుంబం ముప్పాళ్ల గ్రామంలో ఓ వివాహ నిశ్చితార్థం వేడుకలకు వెళ్లి తిరిగి ఒంగోలు వస్తున్నారు. చదలవాడ పశుక్షేత్రం సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో చీరాలకు చెందిన కారు రోడ్డు అంచులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అదే సమయంలో ఒంగోలు నుంచి చీరాల వెళుతున్న వైకాపా నేత కరణం వెంకటేష్ ప్రమాద స్థలంలో ఆగి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
రెండు కార్ల ఢీ.. ఏడుగురికి గాయాలు - ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం
రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. జాతీయరహదారిలో వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కారు పక్కనే ఉన్న పొలాల్లోకి బోల్తా పడింది. అందులో ఉన్న ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.
road accident