ప్రకాశం జిల్లా దర్శిలో 44 కరోనా కేసులు నమోదయ్యాయి. దర్శి నగర పంచాయతీలోని కొన్ని ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్లుగా ప్రకటించినా... ప్రజలు మాత్రం ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
దర్శిలో కరోనా విజృంభణ..నిబంధనలు పట్టించుకోని ప్రజలు - కరోనా వార్తలు
ప్రకాశం జిల్లా దర్శిలో కరోనా విజృంభిస్తోంది. దర్శి నగర పంచాయతీలోని పలు ప్రాంతాలను అధికారులను రెడ్జోన్లుగా ప్రకటించినా... ప్రజలు మాత్రం కనీస నియమాలు పాటించకుండా వ్యవరించటంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దర్శిలో కరోనా విజృంభణ
శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ కావటంతో పెళ్లి వస్తువుల కొనుగోలు కోసం పెద్ద ఎత్తున జనం తరలి వస్తుండటంతో... దర్శి రోడ్లు జనమయమయ్యాయి. వస్త్ర, బంగారు దుకాణాల వద్ద జనసందోహం ఎక్కువైంది. దుకాణాల వద్ద కనీస నియమాలు పాటించటం లేదు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దుకాణాలను మూసివేయించారు. తాము వెళ్లిపోగానే మళ్లీ అదే రీతిలో దుకాణ యజమానులు ప్రవర్తిస్తున్నారని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: