ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారత్ కథనానికి స్పందించారు... ధరల పట్టిక ఏర్పాటు చేశారు - చీరాల కూరగాయల మార్కెట్

చీరాలలోని సచివాలయాల వద్ద ఏర్పాటు చేసిన దుకాణాల్లో ఇష్టం వచ్చిన రీతిలో కూరగాయలను అధిక ధరలు అమ్ముతున్న విషయాన్ని ఈటీవీ భారత్ గమనించింది. వెంటనే కథనాన్ని ప్రసారం చేసింది. వెంటనే స్పందించిన అధికారులు ధరల పట్టిక బోర్డులను ఏర్పాటు చేశారు

reaction on etv bharat story
భారత్ కథనానికి స్పందించారు... ధరల పట్టిక ఏర్పాటు చేశారు

By

Published : Jun 15, 2020, 11:56 AM IST

ప్రకాశం జిల్లా చీరాలలోని సచివాలయాలవద్ద ఏర్పాటుచేసిన దుకాణాల్లో కూరగాయలను వ్యాపారులు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఈ విషయాన్ని ఈటీవీ భారత్ పరిశీలించింది. ఒక్కో దుకాణంలో ఒక్కో రేటుకు కూరగాయలను అమ్ముతున్నట్లు గమనించింది. కొరవడిన పర్యవేక్షణ.. కొండెక్కిన కూరగాయల ధరలు అనే కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన మున్సిపల్ అధికారులు...దుకాణాల వద్ద ధరల పట్టికను ఏర్పాటు చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. సమస్య పరిష్కరించినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి-ప్రకాశం జిల్లా అక్కాచెల్లిలిద్దరూ సరస్వతి పుత్రికలు

ABOUT THE AUTHOR

...view details