ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎస్సీ వసతి గృహాన్ని ఆర్డీఓ రామకృష్ణా రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని వసతుల కల్పనపై అక్కడున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంపై ఫిర్యాదులు వస్తున్నాయని ఆర్డీఓ తెలిపారు. మెనూ అమలుకు సంబంధించి రికార్డులను అడగారు. వార్డెన్ అందుబాటులో లేరని.. విధులకు సరిగా రారని విద్యార్థులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. భోజనం ఎలా ఉంటుందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యత గతం కంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉందని విద్యార్థులు తెలిపారు.
వసతి గృహంలో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ - markapuram
ప్రకాశం జిల్లా మార్కాపురం ఎస్సీ వసతి గృహాన్ని ఆర్డీఓ రామకృష్ణా రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. భోజన నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఎస్సీ వసతి గృహంలో ఆర్డీఓ తనిఖీ