ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పంచాయతీ రాజ్ భవనం రోడ్డులో గల రేషన్‌షాపు నుంచి బియ్యాన్ని అర్థరాత్రి అక్రమంగా తరలిస్తున్నారు. లారీలో బియ్యాన్ని లోడ్ చేస్తుండగా పాత్రికేయుడు ఫొటోలు తీయడం చూసి దళారులు పరారయ్యారు. పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యన్ని అక్రమంగా రైస్ మిల్లర్లకు సరఫరా చేస్తున్నారు.
పేదల బియ్యం పక్కదారి... అర్థరాత్రి అక్రమ తరలింపు - దర్శిలో అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు
పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. కరోనా కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు బియ్యం, కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. కానీ కొంత మంది రేషన్ దుకాణ నిర్వహకులు అర్థరాత్రి గుట్టు చప్పుడు కాకుండా రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లర్లకు సప్లై చేస్తున్నారు.
రేషన్ షాపు ముందు బియ్యం బస్తాలు
ఇదీ చదవండి