సర్వర్లు మొరాయించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రేషన్ డీలర్లు ప్రకాశం జిల్లా కనిగిరిలో ధర్నా చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇపీఓయస్ మిషన్లతో నిరసన వ్యక్తం చేశారు. సిగ్నల్ సమస్యల వల్ల ఎక్కువ మంది లబ్ధిదారులకు సకాలంలో రేషన్ సరకులు ఇవ్వలేకపోతున్నామని అన్నారు. 100 మంది వినియోగదారులకుగాను.. కేవలం 10మందికి కూడా పంపిణీ చేయలేకపోతున్నామని వాపోయారు. సర్వర్లు మొరాయించడం వల్ల రేషన్ సరుకులకు లబ్ధిదారుల నుంచి రెండుసార్లు వేలిముద్రలు తీసుకోవలసి వస్తుందని అన్నారు. సిగ్నల్ సమస్యను పరిష్కరిస్తే సక్రమంగా రేషన్ పంపిణీ చేస్తామని వారు తెలిపారు.
సిగ్నల్ సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్ల ఆందోళన - కనిగిరిలో రేషన్ డీలర్ల నిరసన
ప్రకాశం జిల్లా కనిగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద రేషన్ డీలర్లు ఇపీఓయస్ మిషన్లతో ఆందోళన చేశారు. సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
కనిగిరిలో రేషన్ డీలర్ల నిరసన