రాష్ట్రంలో 29 వేల మంది రేషన్ డీలర్లు ఉన్నారని, ప్రభుత్వం ఏవిధమైన సంక్షేమ పథకాలు అమలు చేసినా తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర రేషన్ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు దివి లీలా మాధవరావు అన్నారు. కార్డుదారుల సౌకర్యార్థం.. ఇళ్లకే రేషన్ పంపిణీ చేస్తామన్న ప్రభుత్వం నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని.. అయితే వాహన డ్రైవర్లే సరుకులు పంపిణీ చేస్తారని ప్రచారంతో డీలర్లు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న డీలర్లకు వృత్తి భద్రత కల్పించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో చీరాల, పర్చూరు నియోజకవర్గాల రేషన్ డీలర్ల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రేషన్ పంపిణీ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సాక్షిగా హామీ...