రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారని రాష్ట్ర విద్యుత్, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గపరిధిలోని వలేటివారిపాలెం గ్రామంలో గృహ నిర్మాణ పక్షోత్సవాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఈ నెల 17 నుంచి జులై 2వ తేదీ వరకు గృహ నిర్మాణ పక్షోత్సవాలను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. అన్ని గ్రామాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజీ హెల్త్ క్లినిక్స్, మహిళా పాల డైరీల భవనాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
వేగంగా అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు: బాలినేని - Prakasham District Latest News
ఈ నెల 17 నుంచి జులై 2వ తేదీ వరకు గృహ నిర్మాణ పక్షోత్సవాలను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వివరించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజీ హెల్త్ క్లినిక్స్, మహిళా పాల డైరీల భవనాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి